#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!

ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
అయితే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది.
40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్‌ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు.
ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
Run out ka Mahual!!
Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A
— cricketinsideout (@Cricketinout) May 24, 2023
చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
మరిన్ని వార్తలు
మరిన్ని వీడియోలు