ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ గెలుపు | Dean holds nerve as England eke out 1-wicket thriller | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ గెలుపు

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 9:48 AM

Dean holds nerve as England eke out 1-wicket thriller

మహిళల క్రికెట్‌లో భాగంగా నిన్న (మే 10) జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ వికెట్‌ తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 48.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ 48.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో బోణీ కొట్టింది. న్యూజిలాండ్‌ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌ మే 13న నార్తంప్టన్‌ వేదికగా జరుగనుంది.

రాణించిన గ్రీన్‌, కెర్‌
చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ బ్యాటర్లు మ్యాడీ గ్రీన్‌ (88), కెప్టెన్‌ అమేలియా కెర్‌ (55) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా జట్టులో ఎ‍వ్వరూ ఓ మోస్తరు స్కోర్లైనా చేయలేదు. దీంతో న్యూజిలాండ్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 

మిగతా ప్లేయర్లలో జార్జియా ప్లిమ్మర్‌ (20), ఇసబెల్లా గేజ్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. సూజీ బేట్స్‌ (6), బ్రూక్‌ హాల్లీడే (6), ఇజ్జీ షార్ప్‌ (6), జెస్‌ కెర్‌ (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. నెన్సి పటేల్‌, బ్రీ ల్లింగ్‌ డకౌట్‌ కాగా.. రోస్‌మేరీ 4 పరుగులతో అజేయంగా నిలిచింది. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌, కోల్‌మన్‌, ఛార్లోట్‌ డీన్‌ తలో 2 వికెట్లు తయగా.. లారన్‌ ఫైలర్‌, గిబ్సన్‌, గ్రివ్‌కాక్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇంగ్లండ్‌ను గెలిపించిన డీన్‌
స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ కూడా తడబడినప్పటికీ.. చివరికి విజయం సాధించింది. కెప్టెన్‌ డీన్‌ 31 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మియా బౌచర్‌ (59), కెంప్‌ (30), గిబ్సన్‌ (19), లారెన్‌ బెల్‌ (12), కోల్‌మన్‌ (3 నాటౌట్‌) సహకరించారు. 

న్యూజిలాండ్‌ బౌలర్లలో రోస్‌మేరీ 3, అమేలియా కెర్‌ 2, జెస్‌ కెర్‌, ఇల్లింగ్‌, నెన్సి పటేల్‌ తలో వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement