పాక్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభానికి ముందు ఆసక్తికర పరిణామం | David Warner loses cool at PSL captains presser | Sakshi
Sakshi News home page

పాక్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభానికి ముందు ఆసక్తికర పరిణామం

Mar 26 2026 8:13 PM | Updated on Mar 26 2026 8:37 PM

David Warner loses cool at PSL captains presser

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెప్టెన్ల ప్రెస్‌ మీట్‌లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌డేవిడ్ వార్నర్ సహచర కెప్టెన్లపై ఫైర్‌ అయ్యాడు. వార్నర్‌ విలేకరుల ప్రశ్నలకు జవాబిస్తుండగా ఇతర ఫ్రాంచైజీల కెప్టెన్లు షాహీన్‌ అఫ్రిది, మొహమ్మద్‌ రిజ్వాన్‌, మార్నస్‌ లబూషేన్‌ నవ్వుకుంటూ కనిపించారు. 

దీంతో చిర్రెత్తిపోయిన వార్నర్‌ వారికి గట్టిగా చురకలంటిచ్చాడు. What’s wrong with you..? Sorry gentlemen, we have got school kids here అంటూ అసహనం ‍ప్రదర్శించాడు. ఎప్పుడూ సరదాగా ఉండే వార్నర్‌ ఇలా రియాక్ట్‌ కావడంతో విలేకరులు సహా అక్కడున్న వారంతా కాసేపు షాక్‌లో ఉండిపోయారు.

ఇదిలా ఉంటే, 2026 ఎడిషన్‌ పాక్‌ సూపర్‌ లీగ్‌ ఇవాళ (మార్చి 26) ప్రారంభ​మైంది. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇంధన సంక్షోభం ఏర్పడటంతో ఈ లీగ్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అవి కూడా కేవలం రెండు వేదికల్లో మాత్రమే జరుపుతున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిది నేతృత్వంలోని లాహోర్‌ ఖలందర్స్‌, మార్నస్‌ లబూషేన్‌ నేతృత్వంలోని కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ తలపడుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement