CWG 2022: స్క్వాష్‌లో సౌరవ్–దీపిక జంటకు కాంస్యం.. భారత్ ఖాతాలో 50వ పతకం

కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ ఈవెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ ఘోషాల్–దీపిక పల్లికల్ జంట భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో సౌరవ్–దీపిక ద్వయం 11–8, 11–4తో డోనా లోబన్–కామెరాన్ పిలె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి కాంస్యం నెగ్గింది. తద్వారా భారత్ ఖాతాలో 50వ పతకం చేరింది. ఇటీవలే ఇద్దరు కవలలకు తల్లైన దీపిక పల్లికల్.. ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య అన్న విషయం తెలిసిందే.