చైనా మారథాన్‌లో పెను విషాదం

Cold weather in China kills 21 in ultramarathon - Sakshi

21 మంది అథ్లెట్లు దుర్మరణం

బీజింగ్‌: చైనాలో శనివారం జరిగిన మారథాన్‌ పెను విషాదన్ని మిగిల్చింది. ఉత్సాహంగా పరుగు పెట్టేందుకు వచ్చిన వారిలో ఏకంగా 21 మంది ఆల్ట్రా మారథాన్‌ రన్నర్లు దుర్మరణం పాలయ్యారు. గాన్జు ప్రావిన్సులోని యెల్లో రివర్‌ స్టోన్‌ ఫారెస్ట్‌ కొండప్రాంతంలో నిర్వహించిన 100 కి.మీ. క్రాస్‌ కంట్రీ మౌంటెన్‌ మారథాన్‌లో ప్రతికూల వాతావరణం ఒక్కసారిగా మిన్నువిరిగి మీద పడినంత పని చేసింది. నిమిషాల వ్యవధిలోనే భీకర వేగంతో గాలివాన సృష్టించిన బీభత్సంలో 21 మంది అథ్లెట్లు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇందులో 172 మంది పాల్గొన్నారు. 8 మంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బీభత్సం తాలుకూ సమాచారం తెలియగానే 1200 మంది రెస్క్యూ టీమ్‌ కొన్ని గంటలపాటు నిరంతరాయంగా శ్రమించి 151 మంది అథ్లెట్లను సురక్షిత ప్రదేశానికి తరలించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top