
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. కెరీర్ ఉన్నతిలో ఎలా విధ్వంసం సృష్టించాడో, లేటు వయసులోనే అదే తరహాలో రెచ్చిపోతున్నాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ది బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఫలితంగా వెస్టిండీస్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
THE CHRIS GAYLE SHOW IN WCL. 🐐
70 (40) with 4 fours and 6 sixes - the vintage Universe Boss at the Edgbaston Stadium, he's hitting them cleanly. 🌟 pic.twitter.com/jM5O2Lt7uo— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఆష్వెల్ ప్రిన్స్ (46 నాటౌట్), డేన్ విలాస్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి 20, నీల్ మెక్‌కెంజీ 0, జాక్ కలిస్ 18, జస్టిన్ ఓంటాంగ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జేసన్ మొహమ్మద్ 2, శామ్యూల్ బద్రీ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. క్రిస్ గేల్, చాడ్విక్ వాల్టన్ (29 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డ్వేన్ స్మిత్ 22, జోనాథన్ కార్టర్ 6, ఆష్లే నర్స్ 0 పరుగులకు ఔట్ కాగా..వెర్నన్ ఫిలాండర్ 2, లాంగ్‌వెల్డ్త్, మెక్ కెంజీ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆరు జట్లు (పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) పాల్గొంటున్న విషయం తెలిసిందే. జులై 3న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగాయి.
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆతర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. అన్ని జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.