IND Vs SA:'అతడు బాగా అలిసిపోయాడు.. తిరిగి వచ్చి అదరగొడతాడు'

Bhuvneshwar Kumar is looking tired says Matthew Hayden - Sakshi

టీమిండియా స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గత కొన్ని మ్యాచ్‌ల నుంచి దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో భువీ పూర్తిగా తేలిపోతున్నాడు. ఆసియాకప్‌-2022లోనూ ఆప్గానిస్తాన్‌పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ కూడా భువనేశ్వర్‌ విఫలమయ్యాడు.

ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భువీ.. తన అఖరి రెండు ఓ‍వర్లలో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు భువీ పేలవ ఫామ్‌ భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ ఫామ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భవీ నాన్‌స్టాప్‌గా క్రికెట్‌ ఆడి అలసిపోయినట్లు కనిపిస్తున్నాడని హేడన్‌ అభిప్రాయపడ్డాడు. 

భువనేశ్వర్‌ కుమార్‌కు విశ్రాంతి అవసరం
భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 అనంతరం హేడన్‌ మాట్లాడూతూ.. "బ్యాటర్ల కంటే ఫాస్ట్‌ బౌలర్లు ఎక్కువగా ఆలసిపోతారు. ఇప్పుడు భువనేశ్వర్‌ కుమార్‌ కూడా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. విరాట్‌ కోహ్లి కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. అతడు కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుని జట్టులో మళ్లీ చేరాడు. ఇప్పుడు విరాట్‌ తిరిగి తన ఫామ్‌ను పొందాడు.

కాబట్టి భువీ కూడా విశ్రాంతి తీసుకుని వచ్చి చెలరేగుతాడు. ఏ బౌలరైనా బాగా అలసి పోతే.. అతడు బంతితో ఏకాగ్రత సాధించలేడు. భువీ అద్భుతమైన బౌలర్‌. అతడికి కాస్త విశ్రాంతి లభిస్తే తన ఫామ్‌ను తిరిగి పొందుతాడని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా, భువీ జోడీ భారత జట్టుకు కీలకం కాబోతుంది అని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భువీకి రెస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top