పీఎస్ఎల్‌లో బాల్ టాంప‌రింగ్‌.. స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు | Ball-Tampering In Pak Super League Caught On Camera, Board Reacts | Sakshi
Sakshi News home page

PSL 2026: పీఎస్ఎల్‌లో బాల్ టాంప‌రింగ్‌.. స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు

Mar 30 2026 3:21 PM | Updated on Mar 30 2026 3:54 PM

Ball-Tampering In Pak Super League Caught On Camera, Board Reacts

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026ను బాల్ టాంప‌రింగ్ వివాదం కుదిపేస్తోంది. ఆదివారం గ‌డాఫీ స్టేడియంలో క‌రాచీ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బాల్ టాంపరింగ్ పాల్ప‌డిన‌ట్లు ఆరోపణ‌లు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్‌ ఫఖర్ జమాన్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని అంపైర్‌లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై లెవల్‌-3 నేరాన్ని మోపారు.

ఏమి జరిగిందంటే?
క‌రాచీ కింగ్స్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ  ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది పేస‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌కు అప్ప‌గించాడు. అయితే ఈ క్ర‌మంలో ఫఖర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వ‌ద్ద‌ మాట్లాడుకున్నారు. ఈ స‌మ‌యంలో బంతికి ఒక‌రు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.

అయితే బంతిని ఫ‌ఖర్ త‌న చేతి వేలితో గీకిన‌ట్లు క‌న్పించింది. దీంతో వెంట‌నే అంపైర్ బంతిని అత‌డి చేతి నుంచి తీసుకుని  టాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో బంతిని మార్చ‌డంతో పాటు ల‌హోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫ‌లితమే తారుమారైంది. అయితే ఈ విష‌యాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియ‌స్‌గా తీసుకుంది.

పీసీబీ సీరియ‌స్‌
మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తదుపరి విచారణ వచ్చే 48 గంటల్లో మరో విచారణ జరగనుంది అని పీసీబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఒక‌వేళ విచారణలో బాల్ టాంప‌రింగ్ పాల్ప‌డిన‌ట్లు రుజువైతే జ‌మాన్‌పై ఒక్క మ్యాచ్ నిషేదం ప‌డే అవ‌కాశ‌ముంది. కాగా గతంలో  డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆసీస్ స్టార్‌ ప్లేయర్లు బాల్ టాంప‌రింగ్‌ పాల్పడి కఠిన శిక్షలు అనుభవించిన విషయం తెలిసిందే.
చదవండి: PSL 2026: పాక్‌ స్టార్‌ ప్లేయర్‌కు భారీ జ‌రిమానా.. ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement