WTC Final 2023: ఆసీస్‌ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్‌.. మరి టీమిండియాలో?!

Australia Confirm WTC Final 2023 Squad: Hazlewood Warner Makes Cut - Sakshi

WTC Final 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తమ ఫైనల్‌ జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. తాజాగా ఐసీసీకి సమర్పించిన వివరాల్లో 15 మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. కాగా తొలుత ప్రకటించిన జట్టులో ఉన్న మిచెల్‌ మార్ష్‌, మ్యాట్‌ రెన్షా మాత్రం తాజాగా టీమ్‌లో చోటు కోల్పోయారు.

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిబంధనలకు అనుగుణంగా బోర్డు ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఇక ఐపీఎల్‌-2023లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా వ్యవహరించిన డేవిడ్‌ వార్నర్‌ జట్టులో కొనసాగనున్నారు.

వారిద్దరు అవుట్‌.. వార్నర్‌కు కోచ్‌ మద్దతు
మార్ష్‌, రెన్షాలకు మాత్రం నిరాశ తప్పలేదు. వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు హెడ్‌కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అండగా నిలవడంతో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు, యాషెస్‌ సిరీస్‌లోనూ వార్నర్‌ కీలక పాత్ర పోషించగలడంటూ మెక్‌డొనాల్డ్‌ అతడికి మద్దతుగా నిలవడం గమనార్హం.

కాగా జూన్‌ 7-11 వరకు ఇంగ్లండ్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. జూన్‌ 12 రిజర్వ్‌ డేగా నిర్ణయించారు. ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది టీమిండియా ఆటగాళ్లు లండన్‌కు చేరుకున్నారు. ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023 ఆస్ట్రేలియా తాజా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్‌.

కాగా భారత ప్రధాన జట్టులో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది.
టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్‌, ఇషాన్‌ కిషన్‌.
చదవండి: WTC Final 2023: రోహిత్‌ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్‌ వర్మ రియాక్షన్‌.. వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top