
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా మహిళల టెన్నిస్ నెంబర్ వన్ ఇగా స్వియాటెకు షాక్ తగిలింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కజకిస్తాన్ సంచలనం.. 23వ ర్యాంకర్, వింబుల్డన్ చాంపియన్ ఎలెనా రైబాకినా చేతిలో 6-4, 6-4 వరుస సెట్లలో ఖంగుతింది. గంటన్నర పోరులో స్వియాటెక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని రైబాకినా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
కాగా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్స్‌కు చేరడం రైబాకినాకు ఇదే తొలిసారి. కాగా స్వియాటెక్ ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో రెండు ఫ్రెంచ్ ఓపెన్ కాగా.. మరొకటి యూఎస్ ఓపెన్ ఉంది. కాగా స్వియాటెక్ గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Letting her racquet do the talking 🤫
— #AusOpen (@AustralianOpen) January 22, 2023
🇰🇿 Elena Rybakina • @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/o42uktZv5v