భారత జట్టులో హైదరాబాద్‌ కుర్రాడు | Asia Oceania Junior Davis Cup Hyderabadi Hrithik Katakam In Indian Team | Sakshi
Sakshi News home page

భారత జట్టులో హైదరాబాద్‌ కుర్రాడు

Apr 7 2026 11:34 AM | Updated on Apr 7 2026 11:34 AM

Asia Oceania Junior Davis Cup Hyderabadi Hrithik Katakam In Indian Team

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా ఓసియానియా జూనియర్‌ డేవిస్‌కప్‌ ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత టెన్నిస్‌ జట్టును ప్రకటించారు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల హృతిక్‌ కటకం చోటు సంపాదించాడు. 

న్యూఢిల్లీలో జరిగిన సెలెక్షన్‌ ట్రయల్స్‌ టోర్నీలో హృతిక్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అగ్రస్థానంలో నిలిచాడు. జాతీయ బాలుర సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న హృతిక్‌ ట్రినిటీస్‌ చాలెంజర్స్‌ టెన్నిస్‌ అకాడమీలో కోచ్‌ హెన్రీ ప్రవీణ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. 

కాగా ఆసియా ఓసియానియా టోర్నీ మే 18 నుంచి 23వ తేదీ వరకు కజకిస్తాన్‌లో జరుగుతుంది. హృతిక్‌తోపాటు రిభవ్‌ సరోహా (చండీగఢ్‌), తవిష్‌ పహ్వా (హరియాణా) కూడా భారత జట్టులో ఎంపికయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement