Asia Mixed Team Badminton Championships 2023: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ ‘బి’లో భారత జట్టు వరుసగా మూడో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 4–1తో మలేసియాను భారత్ ఓడించింది. మహిళల సింగిల్స్‌లో సింధు 21–13, 21–17తో వాంగ్ లింగ్ చింగ్‌పై, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 21–13, 25–23తో లీ జి జియాపై నెగ్గారు.
పురుషుల డబుల్స్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ షెట్టి 16–21, 10–21తో అరోన్ చియా–సో వూయి యిక్‌ల చేతిలో ఓడగా, మహిళల డబుల్స్‌లో గాయత్రీ–ట్రెసా జాలీ 23–21, 21–15తో పియర్లీ టన్–తినా మురళీధరన్‌లపై, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–తనిషా క్రాస్టో 21–19, 19–21, 21–16తో చెన్ తంగ్ జి–తొ ఇ విపై గెలుపొందారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్‌తో భారత్ తలపడుతుంది.
చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో..
Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?!


