Asia Cup 2023: Star Sports Releases Promo To Embark New Phase Of Indian Cricket - Sakshi
Sakshi News home page

#AsiaCup2023: 'వరల్డ్‌కప్‌కు ముందు ఆసియా కప్‌ కొట్టండి'.. ప్రోమో అదిరింది

Jun 17 2023 1:01 PM | Updated on Jun 17 2023 1:24 PM

Asia Cup 2023: Star Sports Releases Promo Video New Phase-Indian Cricket - Sakshi

ఆసియాకప్‌ 2023కి సంబంధించిన హక్కులను బ్రాడ్‌కాస్ట్‌ సంస్థ స్టార్‌స్పోర్ట్స్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు సంబంధించిన ప్రోమోను శుక్రవారం తన ట్విటర్‌లో రిలీజ్‌ చేసింది. ''ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ కొట్టడానికి ముందు ఆసియా కప్‌ కొట్టండి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొండి'' అంటూ టీమిండియాను ఎంకరేజ్‌ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన మాటలు ఆకట్టుకున్నాయి. 

ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొననున్న ఆరు జట్లను చూపిస్తూ ప్రోమో కొనసాగుతుంది. చివరగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఆసక్తికరపోరు ఖాయమని చెబుతూ 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఉపఖండపు దేశాల మధ్య పోరు రంజుగా ఉంటుంది.. అంటూ ముగించింది. స్టార్‌స్పోర్ట్స్‌ రిలీజ్‌ చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు.పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌ జట్లు టైటిల్‌ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్‌... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ జట్లున్నాయి.

గ్రూప్‌ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్‌ ఫోర్‌’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్‌ ఫోర్‌’ దశ తర్వాత టాప్‌–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్‌ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి.

ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌ జరగడంతో ఆసియా కప్‌ టోర్నీని టి20 ఫార్మాట్‌లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది.    

చదవండి: 'వరల్డ్‌కప్‌ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా?

ఎట్టకేలకు ఆసియా కప్‌ 2023 షెడ్యూల్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement