''మా జట్టును చూస్తే కోపం, చిరాకు వస్తుంది''

Ashes 2021: Dawid Malan Frustrated-Dissopinted Own Team Batting Failure - Sakshi

Dawid Malan Frustrated About Own Team Batting Failure.. యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆటతీరును కనబరుస్తుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473 పరుగుల వద్ద డిక్లేర్‌ చేయగా.. అనంతరం ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆదిలోనే 12 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్‌ జో రూట్‌(62), డేవిడ్‌ మలాన్‌(80)లు కలిసి మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ పటిష్టంగానే కనిపించింది.

అయితే రూట్‌, మలాన్‌లు వెనుదిరిగిన వెంటనే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కుప్పకూలింది. స్టోక్స్‌ 34 పరుగులు మినహా మిగతావారు అంతా విఫలమయ్యారు. కేవలం 84 పరుగుల వ్యవధిలో మిగతా ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 237 పరుగుల భారీ ఆధిక్యం లభించినట్టయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. మార్నస్‌ లబుషేన్‌ 2, ట్రెవిస్‌ హెడ్‌ 8 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: Ashes 2nd Test Australia Vs England: స్టార్క్‌ విజృంభణ.. ఆసీస్‌కు భారీ అధిక్యం

ఈ నేపథ్యంలో డేవిడ్‌ మలాన్‌ తన సొంత జట్టుపైనే అసహనం వ్యక్తం చేశాడు.'' ఈరోజు మా ఆటతీరు దురదృష్టకరంగా సాగింది. అన్‌లక్కీ అనే పదం ఇక్కడ వాడకూడదు. మ్యాచ్‌లో కొన్ని చెత్తషాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నాం. కానీ మా ఆటతీరులో నాణ్యత లోపించింది. జట్టుగా సమష్టిగా పరుగులు చేయడంలో విఫలమయ్యాం. నేను, రూట్‌ కలిసి 138 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేసినప్పటికి దానిని నిలబెట్టుకోలేకపోయాం. ఇదే నాకు కోపం, చిరాకు తెప్పించింది. కేవలం 80 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లు చేజార్చుకొని ప్రత్యర్థికి భారీ ఆధిక్యం అందించాం. అయితే ఇప్పటికి మాకు అవకాశాలు సన్నగిల్లలేదు. ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువకు ఆలౌట్‌ చేస్తే పోరాడగలుగుతామనే నమ్మకం ఉంది. ఇన్ని చెప్పినా ఆరోజు ఆట ఎలా సాగాలో అలాగే నడుస్తుంది.. మన చేతుల్లో ఏం ఉండదు. ఎందుకంటే ఇది జెంటిల్మన్‌ గేమ్‌'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్‌ భయ్యా ఎక్కడున్నావు!?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top