చివరి ఓవర్లో సూర్య భాయ్‌ ఒకే మాట చెప్పాడు: అర్ష్‌దీప్‌ సింగ్‌

Arshdeep Singh Reveals Suryakumar Yadavs Message Before Final Over - Sakshi

ఆస్ట్రేలియాతో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టీ20లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ది కీలక పాత్ర. ఆఖరి ఓవర్‌లో ఆసీస్‌ విజయానికి కేవలం 10 పరుగులు మాత్రమే అవసరం. ఈ సమయంలో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బంతిని అర్ష్‌దీప్‌ సింగ్‌ చేతికి ఇచ్చాడు.

అయితే స్ట్రైక్‌లో మాథ్యూ వేడ్‌ వంటి హిట్టర్‌ ఉండడంతో కంగరూలదే గెలుపు అని అంతా భావించారు. కానీ అర్ష్‌దీప్‌ అందరి అంచానలను తలకిందులు చేస్తూ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్‌ అనంతరం తన ఆఖరి ఓవర్‌ అనుభవంపై అర్ష్‌దీప్‌ స్పందించాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని అర్ష్‌దీప్‌ తెలిపాడు.

నేను మొదటి ఓవర్లలో చాలా పరుగులు ఇచ్చాను. కానీ దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. కెప్టెన్‌తో పాటు సపోర్ట్‌ స్టాప్‌ కూడా నన్ను నమ్మి ఆఖరి ఓవర్‌ ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే సూర్య భాయ్‌ ముందే నా వద్దకు వచ్చి ఏమి జరగాలో అది జరుగుతుందని భయపడవద్దు అని చెప్పాడు. నా నేను కెరీర్‌లో చాలా పాఠాలు నేర్చుకొన్నాను. ఆ తర్వాత పుంజుకొన్నాను’ అని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో అర్ష్‌దీప్‌ పేర్కొన్నాడు.
చదవండినాకు బౌలింగ్‌ చేయాలనుంది.. కానీ అదొక్కటే: శ్రేయస్‌ అయ్యర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top