
స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. చైనాలో జరుగుతున్న 2025 ఎడిషన్‌లో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల యువ స్కేటర్ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ భారత్‌కు ఈ అపురూప గౌరవాన్ని అందించాడు.
1000 మీటర్ల సీనియర్ స్ప్రింట్‌లో ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ 1:24.924 సెకన్ల టైమింగ్‌తో రేసును పూర్తి చేసి స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం సాధించి పెట్టాడు.
ఇదే టోర్నీలో ఆనంద్‌కుమార్ 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కుమార్ సాధించిన విజయాలు భారతదేశంలో స్పీడ్ స్కేటింగ్‌కు కొత్త దిశను చూపించాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడలో భారత్‌కు పెద్దగా గుర్తింపు లేదు.
ఆనంద్‌కుమార్ స్వర్ణం సాధించిన అనంతరం ప్రపంచం దృష్టి భారత్‌పై పడింది. అతని విజయాలు యూరప్, లాటిన్ అమెరికా, ఈస్ట్ ఆసియా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తూ, భారత రోలర్ స్పోర్ట్స్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాయి.
ఆనంద్‌కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అతని విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. ఆనంద్‌కుమార్ అంకితభావం, శ్రమ భారత యువతకు స్ఫూర్తిదాయకమని ఎక్స్ ద్వారా తెలిపారు.
జూనియర్ విభాగంలో కృష్ శర్మకు స్వర్ణం
స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం దక్కింది. క్రిష్ శర్మ 1000 మీటర్ల స్ప్రింట్‌లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ అందించాడు.