IPL 2026: డబుల్‌ సెంచరీ కొట్టిన రహానే | Ajinkya Rahane is the 11th player to play 200th IPL game | Sakshi
Sakshi News home page

IPL 2026: డబుల్‌ సెంచరీ కొట్టిన రహానే

Apr 2 2026 7:47 PM | Updated on Apr 2 2026 7:53 PM

Ajinkya Rahane is the 11th player to play 200th IPL game

కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే తన ఐపీఎల్‌ కెరీర్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌ అతనికి 200వది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ మైలురాయిని ఇప్పటివరకు కేవలం 11 మంది (రహానేతో కలుపుకొని) మాత్రమే చేరుకున్నారు. 

ఈ జాబితాలో ఎంఎస్‌ ధోని (278) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ (273, విరాట్‌ కోహ్లీ (268), దినేష్‌ కార్తీక్‌ (257), రవీంద్ర జడేజా (255), శిఖర్‌ ధవన్‌ (222), రవిచంద్రన్‌ అశ్విన్‌ (221), సురేష్‌ రైనా (205), రాబిన్‌ ఉతప్ప (205), అంబటి రాయుడు (204), అజింక్య రహానే (200) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.   

2008లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రహానే.. ఇప్పటివరకు రాజస్థాన్‌ రాయల్స్‌, రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ప్రస్తుతం కేకేఆర్‌కు ఆడుతున్నాడు. రహనే తన 18 ఏళ్ల ఐపీఎల్‌ ప్రయాణంలో 2 శతకాలు, 34 అర్ద శతకాల సాయంతో 5099 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. ఓ మార్పు చేసింది. 

యువ స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌ జట్టులోకి వచ్చాడు. తొలి 3 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 43-0గా ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (14 బంతుల్లో 34; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (8) ఆచితూచి ఆడుతున్నాడు.

తుది జట్లు..

కేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

ఇంపాక్ట్ సబ్‌లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్‌మన్ పావెల్

సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్

ఇంపాక్ట్ సబ్‌లు: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఎషాన్ మలింగ, ఆర్ స్మరన్, సాకిబ్ హుస్సేన్
 

Advertisement
 
Advertisement
Advertisement