హుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయంలో గురువారం రెండోసారి వారసంత వేలం చైర్ పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మొదటిసారి జరిగిన వేలంలో రూ.2 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్ గడువు లోగా మూడో వంతు డిపాజిట్ చెల్లించకపోవడంతో వేలం పాటను రద్దు చేశారు. దీంతో కాంట్రాక్టర్ డిపాజిట్ కింద చెల్లించిన రూ.10 లక్షలు జప్త్ చేసినట్లు కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. వేలంలో ఉప్పుల రాంరెడ్డి అనే కాంట్రాక్టర్ రూ.1.10 కోట్లకు వారసంతను దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


