మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాతాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. గంగరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది పట్నాలు వేశారు. ఆలయ ముఖ మండపంలో నిత్యకల్యాణం, అభిషేకం, ఒడిబియ్యాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టి వేడుకున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులు


