కాంగ్రెస్‌కు గాంధీపై ప్రేమ లేదు..
సిద్దిపేటజోన్: ‘రామరాజ్యం అనేది మహాత్మాగాంధీ కల, అది పీఎం నరేంద్రమోదీ ద్వారానే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ గాంధీ కలలను పట్టించుకోవడం లేదు, వారికి గాంధీ మీద ప్రేమ లేద’ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇటీవల గెలుపొందిన బీజేపీ సర్పంచ్. ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశంలో బీజేపీ మార్పు కోరుతోందన్నారు. కాంగ్రెస్ అనేక మాట లు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. భవిష్యత్తులో సిద్దిపేట జెడ్పీ పీఠం, మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


