దేవుడి కృపతో అందరూ బాగుండాలి
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
దుబ్బాక: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన దుబ్బాక బాలాజీ ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఆలయాన్ని సుందరంగా నిర్మించడం, స్వామి వారు భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతుండడం అద్భు తమని అన్నారు. ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, బాధ్యులు చింత నాగేందర్ ఆధ్వర్యంలో డీఈఓతో పాటు ఎంఈఓ ప్రభుదాసును వేదపండితులు సన్మానించారు.
తపస్ జిల్లా అధ్యక్ష,
కార్యదర్శుల ఎన్నిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా చిలుముల మురళీధర్, ప్రధాన కార్యదర్శిగా వంగ నర్సిరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా దేశ్ భాస్కర్, హరిపురం రఘులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిలుముల మురళీధర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తపస్ నిస్వార్థ సేవలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండలాల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన నాయకులు
కోహెడరూరల్(హుస్నాబాద్): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలుపొందిన తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యాక స్వర్ణలత, నాయకులు కేంద్ర మంత్రి బండి సంజ య్ కుమార్‌ను కలిశారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
బీజేపీని బలోపేతం చేద్దాం
ఎంపీ రఘునందన్‌రావు
తొగుట(దుబ్బాక): గ్రామీణ ప్రాంతంలో బీజే పీని బలోపేతం చేద్దామని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కార్యకర్తలకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన కా ర్యక్రమంలో సన్మానించారు. ఎంపీ మాట్లా డు తూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజే పీ సత్తాచాలన్నారు. కార్యక్రమంలో చందాపూ ర్ మాజీ సర్పంచ్ నర్సింహులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ జాయింట్ సెక్రటరీగా శివకుమార్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా చారకొండ శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.
దేవుడి కృపతో అందరూ బాగుండాలి
దేవుడి కృపతో అందరూ బాగుండాలి


