కామన్‌ డైట్‌ మెనూ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కామన్‌ డైట్‌ మెనూ అమలు చేయాలి

Dec 22 2025 9:11 AM | Updated on Dec 22 2025 9:11 AM

కామన్‌ డైట్‌ మెనూ అమలు చేయాలి

కామన్‌ డైట్‌ మెనూ అమలు చేయాలి

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, రోజూ కామన్‌ డైట్‌ పాటించాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. ఆదివారం సాయంత్రం కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో సందర్శించారు. రాత్రి భోజనం, వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలను తనీఖీ చేశారు. విద్యార్ధుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించరా?, సన్నబియ్యం నాణ్యతపై ఆరా తీశారు. విద్యాలయ ప్రాంగణంలో వెలుతురు సరిగ్గా లేదని, ఎక్కువ వెలుతురు వచ్చే లైట్లు అవర్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement