కేంద్రానివి కుట్ర పూరిత చర్యలు
సిద్దిపేటజోన్: మహాత్మాగాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధి హామీ పథకం నుంచి తొలగించాలని చూస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకాంక్షరెడ్డి, ఓబీసీ సెల్ కన్వీనర్ సూర్యవర్మలు ఆరోపించారు. పార్టీ పిలుపు మేరకు ఆదివారం గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ ఆశయాలు, ఆయన పేరుతో ఉన్న పథకాలను కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడాన్ని కాంగ్రెస్ ఉరుకోదని అన్నారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు చంద్రం, బుచ్చిరెడ్డి, రియాజ్, రవితేజ, సర్పంచ్‌లు కార్యకర్తలు పాల్గొన్నారు.


