తుది విడత సంగ్రామం నేడే
న్యూస్‌రీల్
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని ఆయా మండల కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేశారు. హుస్నాబాద్‌కు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో, అక్కన్నపేటకు జెడ్పీహెచ్ ఎస్‌లో, కోహెడకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, చేర్యాలకు మండల పరిషత్ కార్యాలయంలో, మద్దూరుకు తాజ్ ఫంక్షన్ హాలులో, దూల్మిట్టకు రైతు వేదికలో, కొమురవెల్లికి జెడ్పీహెచ్‌ఎస్‌లో, కొండపాకకు ఐఎంఓసీ, కుకునూరుపల్లికి కోల అంజయ్య ఫంక్షన్ హాలులో ఎన్నికల సామగ్రిని అందజేశారు. సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని అందించి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ప్రత్యేక బస్సుల తరలివెళ్లారు.
ఆ వెంటనే కౌంటింగ్..
గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరిగేలా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు అమర్చారు. పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చి రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తూ, ఫలితాలను ప్రకటిస్తారు. బ్యాలెట్ బాక్స్‌ల్లో సర్పంచ్ ఓట్లను వేరు చేస్తూనే , తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. పంచాయతీ చివరి వార్డు ఫలితం వెల్లడించిన తర్వాత సర్పంచ్ ఓట్లను గుర్తుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు.
జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరగనుంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, మద్దూరు, చేర్యాల, దుల్మిట్ట, కొమురవెల్లి, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాల్లో పోలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 163 పంచాయతీలకు గాను 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 150 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,432 వార్డు స్థానాల్లో 249 ఏకగ్రీవం కాగా, 1,182 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,895 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
– హుస్నాబాద్
పోలింగ్ అధికారులు ఇలా..
మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులను నియమించారు. పోలింగ్ కేంద్రాలు 1,432, సమస్యాత్మక కేంద్రాలు 46, రిటర్నింగ్ అధికారులు 195 మంది, పీఓలు 1,718 మంది, అసిస్టెంట్ పీఓలు 2,123 మంది, మైక్రో అబ్జర్వర్స్ 37 మంది, వెబ్ కాస్టింగ్ 9, జోనల్ ఆఫీసర్స్ 24 మంది, రూట్ ఆఫీసర్స్ 56 మందిని కేటాయించారు.
తుది విడత సంగ్రామం నేడే
తుది విడత సంగ్రామం నేడే
తుది విడత సంగ్రామం నేడే
తుది విడత సంగ్రామం నేడే


