గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
ములుగు(గజ్వేల్): గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచ్‌లు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సా రెడ్డి సూచించారు. ములుగు మండలం బండనర్సంపల్లిలో మొదటి విడత గ్రామపంచాయ తీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. సర్పంచ్ ఆర్‌ఆర్. లహరీశ్రీధర్‌రెడ్డి, ఉపసర్పంచ్ జహంగీర్, వార్డు సభ్యులను మంగళవారం వారు అభినందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో సర్పంచ్‌లు గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్‌రెడ్డి, భిక్షపతిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, మురళి, రమణారెడ్డి, స్వామిగౌడ్, చంద్రయ్య, యాదగిరి, హన్మంతరెడ్డి, నర్సింలు, నర్సింహ్మారెడ్డి, సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.


