నేడు నాచ‘గిరి’ ప్రదక్షిణ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రవీందర్ గుప్త, ఈఓ విజయరామారావు తెలిపారు. లక్ష్మీనృసింహుని జన్మ నక్షత్ర వేళ ఉదయం 7.30 గంటలకు నాచగిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు. గురు మదనానంద క్షేత్రం పీఠాధిపతి మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో గిరి ప్రదక్షిణ కొనసాగనుంది.
ప్రతిభ చాటినప్పుడే గుర్తింపు
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు తమలోని ప్రతిభను చాటినప్పుడే గుర్తింపు లభిస్తుందని మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. వరంగల్ జిల్లా ప్లాటినం జూబ్లీ హైస్కూల్‌లో నిర్వహించిన ఫెస్ట్ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి 260 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు 120 ప్రాజెక్టులతో హాజరు కాగా ప్రజ్ఞాపూర్‌లోగల సేయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌స్పెక్టర్ వైష్ణవి, గైడ్ టీచర్ నాగలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైన్స్ కేవలం తరగతి గదిలో నేర్చుకునేది కాదని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుందన్నారు. సేయింట్ మేరీస్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల పట్ల అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఇన్నారెడ్డి ఏటీఎల్ ఇన్‌స్పెక్టర్ వైష్ణవి, గైడ్ టీచర్ నాగలక్ష్మితో పాటు విద్యార్థులను అభినందించారు.
కార్మికుల సమస్యలపై
నిరంతర పోరాటాలు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి
గజ్వేల్: కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతర పోరాటాలను కొనసాగిస్తుందని ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి అన్నారు. ప్రతి కార్మికుని ఇంటిపై సీఐటీయూ జెండా ఎగురవేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గజ్వేల్‌లోని తన ఇంటిపై సోమవారం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండ్ల స్వామి మాట్లాడుతూ సీఐటీయూ అఖిలభారత మహాసభలు విశాఖపట్టణంలో ఈ నెల 31 నుంచి జనవరి 4వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ రూపొందించడానికి మహాసభల్లో తీర్మానాలుంటాయన్నారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్‌లను వెంట నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 26 వేలు అందేలా జీఓలు సవరణ చేయాలన్నారు.
పాఠశాలలో మాక్ పోలింగ్
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలోని హైస్కూల్లో సోమ వారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓటు హక్కు వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. విద్యార్థులచే ఓటు వేయించారు. నమూనా ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వంకని శివమణి, ఉపసర్పంచ్‌గా వంకని లోకేష్‌లు విజయం సాధించారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా హెచ్‌ఎం జానకీరెడ్డి, ఇతర అధికారులుగా సత్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు.
నేడు నాచ‘గిరి’ ప్రదక్షిణ
నేడు నాచ‘గిరి’ ప్రదక్షిణ


