మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఈనెల 14న జరగనుండటంతో ఆల య అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మంగళవారం రాతిగీరలు, కోనేరు లోని విగ్రహాలు, రాజగోపురం, కొడెల స్తంభం, స్వామివారి రథానికి రంగులు వేశారు.
సోనియా చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం
హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సందర్భంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పులు తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తదితరులు ఉన్నారు.
తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం
సిద్దిపేటజోన్: బీఆర్‌ఎస్ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం డిసెంబర్ 9 పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక కోటిలింగాల దేవాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో
చెత్త వేయొద్దు
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్
సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 2, 8, 13, 16, 32, వార్డుల్లో సమస్యలపై ఆరా తీశారు. బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయరాదని వార్డులో ప్రజలకు సూచించారు. యూజీడీ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇటీవల వేసిన సీసీ రోడ్లను పరిశీలించారు. మురికి కాల్వలో సిల్ట్ తొలగించాలని, చెత్త చెదారం లేకుండా చూడాలని ఆదేశించారు. రోడ్డు పక్కన మాంస విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మాంస విక్రయాలు కేవలం మార్కెట్‌లలో మాత్రమే చేయాలని సూచించారు. అదేవిధంగా ఇరుకోడ్ శివారులో ఉన్న స్లాటర్ హౌస్‌ను సద్వినియోగం చేసుకోవాలని, అక్కడే మేకలను వధించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్, రాజేశం, చంద్రం, మల్లికార్జున్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు
మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు


