ఎన్నికల ‘సిత్రం’
గుర్తు చేతపట్టి..
మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామ పంచాయతీ అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ఆయా గుర్తులతో అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గుర్తుల కరపత్రాలు, వాల్ పోస్టర్లతోనే కాకుండా తమకు కేటాయించిన గుర్తులను చేతబూని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
‘గుర్తు’ను గీసి..
ప్రచారం చేసి
పంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. మిరుదొడ్డిలోని 6వ వార్డులో ఓ చిన్నారి వినూత్న రీతిలో ప్రచారం చేయడం ఆలోచింపజేసింది. వార్డు మెంబర్‌గా బరిలో ఉన్న అంజయ్య కూతురు రియా ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేసింది. తన తండ్రికి కేటాయించిన గౌను గుర్తును తానే స్వయంగా గీసి ప్రచారం చేయడం ఆకట్టుకుంది. మా నాన్నకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ఇలా కనిపించింది.
ఎన్నికల ‘సిత్రం’


