సొంతూరు.. పోరు జోరు
డీసీసీ అధ్యక్షురాలికి ప్రతిష్టాత్మకం
వర్గల్‌లో పోటీ రసవత్తరం
వర్గల్(గజ్వేల్): హేమాహేమీల నెలవైన వర్గల్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సొంత గ్రామం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుతో ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొన్నది. వర్గల్ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో దీటైన అభ్యర్థి కోసం ఆయా పార్టీలు తీవ్ర కసరత్తు చేశాయి. కాంగ్రెస్ మద్దతుతో వర్గల్ మాజీ జెడ్పీటీసీ తాళ్ల సుధారాణి, బీఆర్‌ఎస్ మద్దతుతో ఆ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరాజు తల్లి దేవగణిక జయభారతి, బీజేపీ మద్దతుతో వర్గల్ మాజీ ఉపసర్పంచ్ రమేశ్ సతీమణి పసుల రజిత పోటీలో నిలిచారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం కైవసం చేసుకునేందుకు ముగ్గురూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆంక్షారెడ్డి, నర్సారెడ్డి పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నర్సారెడ్డి సమక్షంలో ఇటీవల తాజా మాజీ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతిష్టాత్మకమైన వర్గల్ తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి జిల్లా వ్యాప్తంగా నెలకొంది.
సొంతూరు.. పోరు జోరు
సొంతూరు.. పోరు జోరు


