బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
బీఆర్‌ఎస్ బీసీ సంఘం నేతనర్సిహంగరావు
గజ్వేల్‌రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మాయమాటలతో మభ్యపెడుతోందని, ఇప్పటికై నా మేల్కొని బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడాలని బీఆర్‌ఎస్ పార్టీ బీసీ సంఘం నాయకుడు కల్యాణ్‌కర్ నర్సింగరావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు బీసీలను రిజర్వేషన్ల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన వసతులు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పాలనలో ఈశ్వర సాయిచారి బలిదానానికి సిద్ధపడి గాంధీ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వాపోయారు. కార్యక్రమంలో బీసీ నేత ఆర్‌కే శ్రీను తదితరులు పాల్గొన్నారు.


