ఎన్నికల విధులు వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులు వద్దు

Dec 6 2025 9:22 AM | Updated on Dec 6 2025 9:22 AM

ఎన్ని

ఎన్నికల విధులు వద్దు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ కోరారు. డీఈఓ శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, ఆరు నెలలోపు ఉద్యోగ విరమణ కలిగిన వారికి, గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధులు అప్పగించడం సరికాదన్నారు.

రాష్ట్రస్థాయి ‘కబడ్డీ’కి ఎంపిక

హుస్నాబాద్‌రూరల్‌: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు హుస్నాబాద్‌ క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్‌ మడక కృష్ణ శుక్రవారం తెలిపారు. జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు గడిపె సిద్ధు, నన్నె సాయి, రణిల్‌, అభిలాష్‌ 7వ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్‌ కబడ్డీ క్రీడల్లో పాల్గొంటారని కోచ్‌ తెలిపారు.

ఆటపాటలతో విద్యాబోధన

హుస్నాబాద్‌: విద్యార్థులకు ఇంటిని మరిపించే విధంగా ఆటపాటలతో విద్యాబోధనకు సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగా ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ ఇస్తున్నట్టు ఎంఈఓ బండారి మనీల చెప్పారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రి ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడతూ హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు చెందిన ఇన్‌స్ట్రక్టర్లకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ 8 వరకు కొనసాగుతుందన్నారు.

పరిమితిని మించొద్దు

బెజ్జంకి(సిద్దిపేట): పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌, వార్డు పదవులకు పోటీచేసే అభ్యర్థులు పరిమితికి అనుగుణంగా ఖర్చు చేయా లని ఎంపీడీఓ ప్రవీణ్‌ సూచించారు. బెజ్జంకిలో శుక్రవారం అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామాలలో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలు వరకు ఖర్చు చేయవచ్చన్నారు. ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.2.50 లక్షలు. రూ.50 వేలు వరకు ఖర్చు చేయవచ్చని చెప్పారు. ప్రతి రూపాయి జీరో అకౌంట్‌ నుంచి వెచ్చించాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజమౌళి, రూర ల్‌ సీఐ శ్రీను, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎస్‌ఐ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు

తప్పనిసరి: ట్రాఫిక్‌ ఎస్‌ఐ

సిద్దిపేటజోన్‌: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్‌ ఎస్‌ఐ విజయ్‌ భాస్కర్‌ సూచించారు. ఓ స్థానిక స్కూల్‌లో విద్యార్థులకు శుక్రవారం ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం నేరమన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రతా, మైనర్‌ డ్రైవింగ్‌ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ హన్మంతారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మద్యం పట్టివేత

మిరుదొడ్డి(దుబ్బాక): అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మిరుదొడ్డి ఎస్‌ఐ సమత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని మల్లుపల్లిలో గరిపల్లి లక్ష్మణ్‌ ఇంటిలో సోదా నిర్వహించగా 12.39 లీటర్ల మద్యం బాటిళ్ళను పట్టుకొన్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఎన్నికల విధులు వద్దు 
1
1/4

ఎన్నికల విధులు వద్దు

ఎన్నికల విధులు వద్దు 
2
2/4

ఎన్నికల విధులు వద్దు

ఎన్నికల విధులు వద్దు 
3
3/4

ఎన్నికల విధులు వద్దు

ఎన్నికల విధులు వద్దు 
4
4/4

ఎన్నికల విధులు వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement