కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా
మద్దూరు(హుస్నాబాద్): స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీల కోసం నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి బీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలన్నారు. అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో సంతోష్‌కుమార్, చంద్రమౌళి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


