రాష్ట్రంలో రెగ్యులర్ డీఈవోలు ముగ్గురే!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో 33 జిల్లాలుంటే రెగ్యులర్ డీఈవోలు ముగ్గురు మాత్రమే ఉన్నారని, మిగతా చోట్ల అందరూ ఇన్‌చార్జిలే ఉన్నారని, కొన్ని జిల్లాల్లో ఐఏఎస్‌లను ఇన్‌చార్జి డీఈవోలుగా నియమించారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఐఏఎస్ అధికారులకు రెవెన్యూ, లోకల్ బాడీస్ బాధ్యతలుంటాయని, వారిని ఇన్‌చార్జి డీఈవోలుగా నియమించడంతో విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో సైన్స్ ఫెయిర్‌ను శుక్రవారం హరీశ్‌రావు సందర్శించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఓపీఎస్, సీపీఎస్ ఉద్యోగుల సమస్యను పరిష్కారిస్తామని, ఇప్పుడు ఆ విషయమే మాట్లాడటం లేదన్నారు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ ప్రస్తావనే లేదని ఆరోపించారు. స్కావెంజర్లకు 7 నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై త్వరలో తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెగ్యులర్ డీఈవోలు ముగ్గురే!


