మల్లన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం
కొమురవెల్లి(సిద్దిపేట): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మల్లన్న ఆలయంలో బుధవా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, అన్న పూజ నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రసాదవితరణ గావించారు.
లక్షదీపోత్సవం
మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని గంగిరేణు చెట్టు ప్రాంగణంలో లక్షదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం సురభి నాట్యమండలిచే భూకై లాస్ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, అర్చకులు,ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాంకు నిర్మాణానికి చర్యలు
మిరుదొడ్డి(దుబ్బాక): శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు స్థానంలో కొత్త ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటా మని మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ రామచందర్ తెలిపారు. అక్టోబర్ నెల 25న ‘సాక్షి’లో ప్రచురితమైన అమ్మో... వాటర్ ట్యాంక్ అన్న వార్తా కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం మిరుదొడ్డిలో శిథిలావస్థకు చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాటర్ ట్యాంకును ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కింది స్థాయి అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఈఈ నర్సింహులు గౌడ్, డీఈ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా జట్టు
ఘన విజయం
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. వికారాబాద్ జిల్లాలో ఈనెల 3నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్ –14 బాలికల టోర్నమెంట్ జరిగింది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో రంగారెడ్డితో జరిగిన మ్యాచ్‌లో1–0తో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఫైనల్‌లో ఉమ్మడి నల్లగొండ జట్టుపై హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో డ్రాతో ముగియగా తదనంతరం జరిగిన పెనాల్టీ షూటవుట్‌లో ఉమ్మడి జిల్లా జట్టు నల్లగొండ జిల్లా జట్టుపై 3–2 గోల్స్ తేడాతో గెలిచింది.
మల్లన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం
మల్లన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం


