అందరికీ సమాన విద్యే లక్ష్యం
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్
గజ్వేల్: అందరికీ సమానమైన శాసీ్త్రయ విద్యను సాధించడమే లక్ష్యంగా పీడీఎస్‌యూ (ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) ఆవిర్భవించిందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ శ్రీకాంత్ తెలిపారు. బుధవారం గజ్వేల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈనెల 19న గజ్వేల్‌లో నిర్వహించనున్న పీడీఎస్‌యూ నాలుగో జిల్లా మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడీఎస్‌యూ 50ఏళ్లుగా అనుకున్న లక్ష్యం కోసం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తున్నదని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 19న గజ్వేల్‌లో నాలుగో మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ మాట్లాడుతూ విద్యారంగానికి సముచిత బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడం వల్ల.. తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని వాపోయారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రమేశ్, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు రాజులు, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


