రామునిబండ.. జనం నిండా
● భక్తులతో కిటకిటలాడిన ఆలయం ● ఆలయ గోపురానికి భూమిపూజ
రామునిబండకు భక్తజనం పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జంగంరెడ్డిపల్లి సమీపంలోగల బండమీది సీతారాముల ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతియేటా కార్తీకపౌర్ణమి నుంచి రెండు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ గోపుర నిర్మాణానికి నిర్వాహకులు భూమిపూజ నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు గుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. – జగదేవ్‌పూర్(గజ్వేల్)
రామునిబండ.. జనం నిండా


