హరీశ్‌కు నేతల పరామర్శ
దుబ్బాక: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దంపతులు మంగళవారం పరామర్శించారు. హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చారు.
‘ఉపకార’ దరఖాస్తుగడువు పెంపు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ అహ్మద్ మంగళవారం తెలిపారు. వివిధ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆత్మగౌరవ ర్యాలీకి తరలిరండి
సిద్దిపేటకమాన్: నగరంలో నవంబర్ 1న నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ ర్యాలీకి అందరూ తరలిరావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిపైన ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఒకటిన ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజు, యాదగిరి, పర్శరాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో
అధునాతన పరికరాలు
హుస్నాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధునాతమైన వైద్య పరికరాలను మంజూరు చేయించారు. ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్) ద్వారా సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి) నుంచి దాదాపు రూ.1.50 కోట్లు విలువైన పరికరాలు వచ్చాయి. ఈసీజీ పరికరం, అల్ట్రాసౌండ్, మల్టీపారా మానిటర్, ఆక్టోక్లేవ్, డయా తెరమీ, ఫెటల్ మానిటర్, జనరల్ సర్జరీ ఎలక్ట్రికల్ ఏటీ టేబుల్, త్రీ సీట్ చైర్స్, ఈఎన్‌టీ హెడ్ లైట్లు ఇలా మొత్తం 15 రకాల పరికరాలు వచ్చాయి. వివిధ విభాగాల గదుల్లో పరికరాలను బిగించారు. వారం రోజుల్లో వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు.
రుణాలు తిరిగిచెల్లించకపోతే చర్యలు
మద్దూరు(హుస్నాబాద్): మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెలించాలని గ్రామీణ వికాస్ బ్యాంక్ రిజనల్ మేనేజర్ రాజయ్య కోరారు. మంగళవారం మర్మాముల గ్రామాన్ని స్థానిక బ్యాంక్ అధికారులతో కలిసి రుణగ్రస్తుల ఇళ్ల వద్దకు వెళ్లి తిరిగి చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ గ్రామంలోని రుద్రమాదేవి గ్రామైక్య సంఘంలోని తొమ్మిది మహిళా సంఘాలు రూ.60లక్షలు బకాయిపడినట్లు తెలిపారు. పెండింగ్ రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు అందుతాయన్నారు. చెల్లించకపోతే బ్యాంక్ నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో మద్దూరు బ్యాంక్ మేనేజర్ పరుశురాములు, ఫీల్డ్ ఆఫీసర్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌కు నేతల పరామర్శ


