రక్తదానం మహాదానం
అదనపు డీసీపీ
అడ్మిన్ కుశాల్కర్
సిద్దిపేటకమాన్: పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటారని అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం ఆపద సమయంలో మనిషి ప్రాణాలను కాపాడే పవిత్రమైన కార్యమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రక్తదానం చేస్తున్న పోలీస్


