మా ఊరి సమస్యలు పరిష్కరించరూ..
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025డ
మిరుదొడ్డి(దుబ్బాక): మా ఊరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల పరిధిలోని అందె గ్రామానికి చెందిన విద్యార్థులు మంగళవారం వినూత్న రీతిలో పోలీస్‌స్టేషన్‌లో వినతి పత్రాన్ని అందించారు. పోలీస్ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరుతూ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు అందె విద్యార్థులతో పాటు రైతులు, జేఏసీ కమిటీ సభ్యులు ఏఎస్‌ఐ శేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామానికి మూడు వైపులా ఉన్న రోడ్లన్నీ ధ్వంసమై గుంతలు పడటంతో బస్సులు సైతం రద్దయ్యాయని విద్యార్థులు వాపో యారు. మిరుదొడ్డి, సిద్దిపేట, గజ్వేల్ వంటి పట్టణాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే ధ్వంసమైన రోడ్ల కారణంగా అవస్థలు పడాల్సి వస్తున్నదని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు, దేవాలయాల వద్ద మందు బాబులు మద్యం సేవించి అపరిశుభ్రంగా మారుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలకు కళ్ళెం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఊరి సమస్యలను పోలీసుల ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యార్థులు కోరారు. అందె జేఏసీ కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పీఎస్‌లో అందె గ్రామ విద్యార్థుల వినతి
మా ఊరి సమస్యలు పరిష్కరించరూ..


