ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో చేరికలు
బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు సిద్దిపేట వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. కానీ నేడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. పట్టణంలో ఆంతర్గత రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


