
సీపీని కలిసిన ‘బీ స్మాట్’ ప్రతినిధులు
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్‌ను సీపీ కార్యాలయంలో బీ స్మాట్ (బడ్జెట్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ) ప్రతినిధులు కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా విద్యాసంస్థల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, సికిందర్, వెంకటేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు బాధ్యతతో పని చేయాలి
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
నంగునూరు(సిద్దిపేట): ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చేస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన నంగునూరు మండలంలోని 11 మందిని బుధవారం డీఈఓ సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు విద్యా ప్రమాణాలను పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వృత్యాంతర శిక్షణలో నేర్చుకున్న అంశాలు, మెలకువలను విద్యార్థులకు బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎం రామస్వామి, సుధాకర్, ప్రిన్సిపాల్ జానయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీచర్లకు
టెట్ పరీక్ష రద్దు చేయాలి
గజ్వేల్: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత పరీక్ష రద్దు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దామెర రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్ మండలం జాలిగామ, బెజుగామ, ఆహ్మదీపూర్, సింగాటం, పిడిచెడ్, బూర్గుపల్లి, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ తదితర ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలను ముమ్మరం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి, గజ్వేల్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు సురేష్, ధమ్మని మల్లయ్య పాల్గొన్నారు.

సీపీని కలిసిన ‘బీ స్మాట్’ ప్రతినిధులు

సీపీని కలిసిన ‘బీ స్మాట్’ ప్రతినిధులు