● ఆఫీస్ వేళల్లో బయట బలాదూర్ ● జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఉద్యోగుల తీరు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తీరు ఏ మాత్రం మారడం లేదు. బుధవారం మధ్యాహ్నం 12.25గంటలకు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ‘సాక్షి’ వెళ్లగా అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి ఫీల్డ్ విజిట్‌లో ఉండగా, కేవలం జూనియర్ అసిస్టెంట్ మాత్రమే కార్యాలయంలో ఉన్నారు. మిగతా అఽధికారులు, సిబ్బంది లేక కార్యాలయం వెలవెలబోయింది. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు కార్యాలయం బయటే అధికారుల కోసం వేచి చూస్తున్నారు. వారిని ‘సాక్షి’ పలకరించగా అధికారులు లేరని గంట నుంచి బయటే వేచి చూస్తున్నామన్నారు. అయితే ఈ శాఖలో విధులు నిర్వహించే ఇతర అధికారులు, సిబ్బంది తమ ఇష్ట రాజ్యంగా తమకు నచ్చినపుడు కార్యాలయంలో.. మిగతా సమయంలో బయట బలాదూర్‌గా తిరుగుతున్నారని, ఇక్కడి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. వర్కింగ్ టైంలో అధికారులు లేకపోవడం విడ్డూరంగా ఉందని, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో ఉండే పశుసంవర్ధకశాఖ కార్యాలయంలోనే ఉద్యోగులు, సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, డివిజన్, మండలాల్లోని అధికారులు, సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తారో అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల ఇష్టారాజ్యం..
అధికారుల ఇష్టారాజ్యం..