
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసం దీపాల వెలుగుల్లో శోభిల్లుతోంది. బుధవారం నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో సాయం సంధ్యవేళ ఆకాశదీపోత్సవం, అనంతరం భక్తజన సామూహిక కార్తీక దీపోత్సవం కొనసాగింది. కార్తీకంలో దైవదర్శనం, దీపారాధన శుభకరమని దీపోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ సిబ్బంది, అర్చకులు తగు ఏర్పాట్లు చేశారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోనూ కార్తీక దీపోత్సవం నిర్వహించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు ఆలయ అర్చకులుప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.
– వర్గల్(గజ్వేల్) / కొమురవెల్లి(సిద్దిపేట)
నేత్రపర్వం..

గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025