
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నంగునూరు(సిద్దిపేట): నాణ్యమైన సరుకులతో మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం బద్దిపడగ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పాటించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్‌ఎం పద్మ వంట సరుకులు, కూరలను పరిశీలించడంలేదని, స్లాబ్ నుంచి నీరు కారుతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్‌లో ఆదేశించారు. పాఠశాలలో రోజు అందించే మెనూ వివరాలను అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలసి అక్కడే భోజనం చేశారు. క్రమశిక్షణ, చక్కని అలవాట్లు అలవర్చుకొని, ఒక లక్ష్యంతో చదివి ప్రయోజకులు కావాలని విద్యార్థులకు సూచించారు.