
లింగనిర్ధారణ చేపడితే చర్యలు
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అడ్వైజరీ కమిటీ సమావేశంను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చట్టవిరుద్దంగా అబార్షన్‌లు చేపడితే చర్యలు చేపడతామన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు డీ ఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుప్రియ, డాక్టర్ రమ్య మాధురి, డీపీఆర్‌ఓ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.