
ఆర్యవైశ్య సేవలు అమోఘం
● అని రంగాల్లో ముందంజ
● ఎమ్మెల్యే హరీశ్‌రావు
● విశిష్ట సేవలందించినవారికి అవార్డుల ప్రదానం
ప్రశాంత్‌నగర్(ిసిద్దిపేట): ఆర్యవైశ్యుల సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్యే హరీఽశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని వైశ్య భవన్‌లో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ శోభశ్రీ ప్రాంతీయ సదస్సులో భాగంగా వివిధ సేవల్లో ఎంపికై న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసవి, వనిత, ఇలా సంస్థ పేరు ఏదైనా సామాజిక సేవే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో గో సేవలు, పేదల వివాహాలకు పుస్తెమట్టెలు, వంట సామగ్రి, దుస్తుల పంపిణీ, తదితర కార్యక్రమాలు గొప్పవన్నారు. మహిళ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, రక్తదాన శిబిరాలు, ఉచిత అన్నదాన సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు గతంలో కేవలం వ్యాపార రంగంపైనే దృష్టి సారించేవారని, నేడు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలల్లోను కీలకంగా మారారన్నారు. అమర్నాథ్, కేదారినాథ్, అయోధ్య ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహించిన చరిత్ర మన సిద్దిపేట ఆర్యవైశ్యులకు ఉందని కితాబిచ్చారు. సమయాన్ని కుటుంబానికి, వ్యాపారానికి, సేవా కార్యక్రమాలకు మాత్రమే కేటాయించడం గొప్ప విషయమన్నారు. అందుకే పది మంది మిత్రులు ఉంటే అందులో ఒక ఆర్యవైశ్యుడు ఉండాలనేది మన పెద్దల మాట అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లురి శశాంక్, మాంకాల నవీన్‌కుమార్, నాగరాణి, పుల్లురి శివకుమార్, గంప శ్రీనివాస్, గంప కృష్ణ, పుల్లురి శ్రీనివాస్, సోమ శివకుమార్, వనజ, తదితరులు పాల్గొన్నారు.