
93 షాపులు..
95 దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు డిపాజిట్ (నాన్ రిఫండబుల్) రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావహులు అంతగా ఆసక్తి చూపడం లేదు. నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సిద్దిపేట ఎకై ్స జ్ పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీన పట్టణంలోని సీసీ గార్డెన్‌లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా వైన్ షాప్‌లను కేటా యించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 17 రోజులైనా ఇప్పటి వరకు 95 దరఖాస్తులే రావడంతో ఎకై ్సజ్ అధికారులు ఆలోచనలో పడ్డారు.
ఆసక్తి చూపడం లేదు..
జిల్లాలోని 93 వైన్ షాప్‌లకు ఇప్పటి వరకు 95 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సిద్దిపేట సర్కిల్‌లో 31, గజ్వేల్ సర్కిల్‌లో 29, హుస్నాబాద్ సర్కిల్‌లో 17, చేర్యాల సర్కిల్‌లో 17, మిరుదొడ్డి సర్కిల్‌లో ఒక దరఖాస్తు చొప్పున వచ్చాయి. దరఖాస్తు డిపాజిట్ రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావాహులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏ షాప్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఏ దుకాణానికి టెండర్ వేయాలని అందరూ కలిసి సమాలోచనలు చేస్తున్నారు. గత మద్యం పాలసీలో 93 వైన్ షాప్‌లకు 4,166 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 18వ తేదీ చివరి తేదీ కావడంతో ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయో? ఎలా పెంచాలో అని ఎకై ్సజ్ అధికారులు సమాలోచన చేస్తున్నారు.
చివరి మూడు రోజులే కీలకం
చివరి మూడు రోజుల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపార పెద్దలను సంప్రదించి దరఖాస్తులు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
17 రోజులైనా మందకొడిగా ప్రక్రియ
గతేడాది 4,166 దరఖాస్తులు
డిపాజిట్ రూ.3లక్షలకుపెంచడంతో అనాసక్తి
చివరి మూడు రోజులే కీలకమంటున్న అధికారులు
గతేడాది కంటే ఎక్కువ వస్తాయి..
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు దారులు ఆలోచనలో పడ్డారు. కానీ ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే రావడంతో ఇప్పుడు దరఖాస్తులు పెరుగుతాయని ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు 95 దరఖాస్తులు వచ్చాయి. గత మద్యం పాలసీలో 4,166 దరఖాస్తులు వచ్చాయి. అప్పటి లాగానే ఈ సారి కూడా చివరి మూడు రోజుల్లోనే అధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కంటే ఈ సారి ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నాం.
–శ్రీనివాసమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్

93 షాపులు..