
భక్తజన నాచగిరి
పట్నాలు వేసి.. మొక్కులు చెల్లించి
మల్లన్న ఆలయంలో భక్తుల కోలాహ లం
గంగిరేణి చెట్టు
ప్రాంగణంలో భక్తుల సందడి
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఆలయ పుష్కరిణి, హరిద్రానది వాగులో పుణ్యస్నానాలాచరించారు. గర్భగుడిలో సర్వాలంకృతులై కొలువుదీరిన శ్రీలక్ష్మీనృసింహుల దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో దేవతామూర్తులను దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బందికలగకుండా పర్యవేక్షించారు.
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆల యం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్‌లు పర్యవేక్షించారు.

భక్తజన నాచగిరి

భక్తజన నాచగిరి