
అధునాతన మార్గం.. ఛిద్రం
ఇటీవల తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో అధునాతన హంగులతో నిర్మించిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి పలు చోట్ల ఛిద్రమై ప్రయాణికులకు నరకం చూపుతోంది. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దూకడంతో ఆ వరదంతా ప్రధాన రోడ్డుపైకి చేరి, రోజుల తరబడి రాకపోకలకు ఇబ్బంది కలిగిన విషయం తెల్సిందే. రూ.45కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు.. వరద ఉధృతికి ఇలా మారడం కలవరానికి గురిచేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
– గజ్వేల్