
దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తాం
గజ్వేల్‌రూరల్: దివ్యాంగులకు వారి వైకల్యాన్ని మేరకు ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర శిక్షా విభాగం జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి రంగనాథ్ తెలిపారు. మంగళవారం ప్రజ్ఞాపూర్‌లోగల బాలుర ఉన్నత పాఠశాలలో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమయ్యే ఉపకరణాలను అందించేందుకు నిర్దారణ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, కొండపాక, ములుగు, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, కుకునూర్‌పల్లి, మర్కుక్ మండలాల నుంచి 60మందికి పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే వీరందరికీ ఉపకరణాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు కోమల, భవిత సెంటర్ నిర్వాహకురాలు హరిత తదితరులు పాల్గొన్నారు.